కేటీఆర్ ని కలవడానికి ప్రగతి భవన్ కి వెళ్లి.. అక్కడే కుప్పకూలిపోయారు.  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ముషీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్.. అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్ ని కలవడానికి ప్రగతి భవన్ కి వెళ్లి.. అక్కడే కుప్పకూలిపోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం కేటీఆర్ ని కలిసేందుకు ముఠా గోపాల్ ప్రగతి భవన్ కి వెళ్లారు. పార్టీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ప్రఫుల్‌ రాంరెడ్డిని పోటీ నుంచి తప్పించేందుకు చర్చించాలనుకున్నారు. భోజనం చేసిన తర్వాత మాట్లాడుదామని కేటీఆర్‌ చెప్పడంతో ప్రెషప్‌ అయ్యేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లిన గోపాల్‌ తిరిగి బయటకు రాలేదు.

వాష్ రూప్ లోకి వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానంతో.. ఆయన వెంట వచ్చిన పుట్టం పురుషోత్తమ్ లోపలికి వెళ్లి చూశాడు. కాగా.. అతను కిందడిపోయి కనిపించాడు.వెంటనే ఆయనను దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హైబీపీ వల్ల ఆయన పడిపోయారని వైద్యులు చెప్పారు.