జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని గిరిజనులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని చెప్పి.. ఇంత వరకు వేయలేదని నిలదీశారు.
జనగామ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పర్యటనను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటేందుకు వెళ్తుండగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు రత్నతండా వాసులు. తమ గ్రామానికి రోడ్డు వేస్తామని చెప్పి.. ఇంత వరకు వేయలేదని నిలదీశారు. దీంతో పోలీసులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
