hyderabad accident : హైదరాబాద్ లో ఘోరం జరిగింది. ఓ బస్సు టైర్ల కింద పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జవహర్ నగర్ లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ లో చోటు చేసుకుంది.

hyderabad accident : హైదరాబాద్ విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మరణించింది. ఈ ఘటన సిటీలోని జవహర్ నగర్ లో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్ నగర్ లోని ఆనంద్ నగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో మూడేళ్ల భవిష్య అనే చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Mohammad Shami : మహ్మద్ షమీ గ్రామంలో స్టేడియం నిర్మించనున్న యూపీ ప్రభుత్వం..

అయితే భవిష్యకు ఓ సోదరుడు ఉన్నాడు. ఆ బాలుడు రచన గ్రామర్ హైస్కూల్ చదువుకుంటున్నాడు. ప్రతీ రోజు ఆ కాలనీకి స్కూల్ బస్సు వచ్చి ఆ బాలుడిని ఎక్కించుకొని వెళ్తుంది. ప్రతీ రోజూ ఆ బస్సు దగ్గరికి భవిష్య కూడా వచ్చి వెళ్తుండేది. అయితే ఎప్పటిలాగే శనివారం కూడా ఆ బస్సు ఆ కాలనీకి వచ్చింది.

Chandrayaan-4:చంద్రుడిపై మరో ప్రయోగం.. చంద్రయాన్-4కు సిద్ధమవుతున్న ఇస్రో

దీంతో బాలుడితో పాటు సోదరి కూడా అక్కడికి చేరుకుంది. అయితే ప్రమాదవశాత్తూ భవిష్య ఆ బస్సు ముందు భాగంలో ఉన్న టైర్ల కింద పడిపోయింది. దీంతో ఆ చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడే చనిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.