Asianet News TeluguAsianet News Telugu

న్యూఇయర్ ఎఫెక్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

 ఈ వేడుకల సందర్భంగా నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. 

traffic ristriction in hyderabad on dec31st night
Author
Hyderabad, First Published Dec 31, 2018, 9:47 AM IST

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఫోలీసులు ఆంక్షలు విధించారు.  ఈ వేడుకల సందర్భంగా నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బేగంపేట ఫ్లై ఓవర్ విమనహా.. అన్ని ఫ్లై ఓవర్ లపై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10గంటల నుంచి అర్థరాత్రి వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. 

ఖైరతాబాద్‌ కూడలి నుంచి నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహన చోదకులు ఖైరతాబాద్‌ కూడలి నుంచి రాజ్‌భవన్‌ మీదుగా వారి గమ్యస్థానాలను చేరుకోవాలి.

బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు తెలుగుతల్లి కూడలి దగ్గర మళ్లిస్తారు. ఆ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌, ఆయోధ్య మీదుగా వెళ్లాలి.

 లిబర్టీ కూడలి నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనచోదకులు జీహెచ్‌ఎంసీ కార్యాలయం, బీఆర్‌కే భవన్‌, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా వారి గమ్యస్థానాలను చేరుకోవాలి.

 ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు అక్కడి నుంచే మళ్లిస్తారు. ఆ వాహనాలు సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ లేన్‌, లక్డీకాపూల్‌ మీదుగా వెళ్లాలి.

 మింట్‌ కాంపౌండ్‌ నుంచి సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. నల్లగుట్ట రైల్వే వంతెన నుంచి సంజీవయ్య పార్కు వైపు వచ్చే వాహనాలు కర్బలామైదాన్‌ లేదా మినిస్టర్‌ రోడ్‌ మీదుగా వెళ్లాలి.

సికింద్రాబాద్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు సెయిలింగ్‌ క్లబ్‌, కవాడిగూడ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం మీదుగా ముందుకు సాగాలి.

ట్రావెల్‌ బస్సులు, లారీలు, భారీ వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వరకూ అనుమతించబోరు.
 

Follow Us:
Download App:
  • android
  • ios