హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, యువ నేత నగేశ్‌ మధ్య జరిగిన గొడవపై టీపీసీసీ సీరియస్ అయ్యింది.  దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నగేశ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

వాగ్వాదం సందర్భంగా వీహెచ్‌ను నగేశ్ తోసివేయడంతో ఆయన కిందపడిపోయారు. మొత్తం మీద నగేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.