హైదరాబాద్: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారుఈ విషయమై ఉత్తమ్  సీఎం కేసీఆర్ కు మంగళవారం నాడు బహిరంగ లేఖ రాశారు.

హైకోర్టు తీర్పు ప్రకారంగానే కుల గణన చేపట్టాలని  ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ  ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై  అన్యాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

పంచాయితీరాజ్ ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కులాల గణన చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు తీయాలని ఉత్తమ్  డిమాండ్ చేశారు.

బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడం వల్ల సుమారు 900 గ్రామపంచాయితీల్లో సర్పంచ్ లుగా పోటీ చేసే అవకాశాన్ని బీసీలు కోల్పోతున్నారని  ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.