న్యూఢిల్లీ: కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ లో కొత్తదనం ఏమీ లేదన్నారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులను కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరచిందన్నారు. 

రైతులు, నిరుద్యోగుల ప్రస్తావనలేని బడ్జెట్ అంటూ విమర్శించారు. పబ్లిక్‌ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సరికాదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన హామీలనే పొందుపరిచి మళ్లీ చదివారని ఆరోపించారు. 

యువతకు ఉద్యోగ కల్పనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, చిన్నతరహా పరిశ్రమల బలోపేతానికి ఊతం ఇవ్వకుండా నిరాశపరిచిందన్నారు. కేంద్రబడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.