ఆర్టీసీ కార్మికులు  తమ సమ్మెను ఉధృతం చేయాలని భావిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 

హైదరాబాద్: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను సాధించేవరకు పోరాటం సాగించాలని ఆయన కోరారు. తాము ఆర్టీసీ కార్మికులకుఅండగా నిలుస్తామని ఆయన తేల్చి చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద చేసే ఆందోళనలకు తాము సంఘీభావం తెలుపుతామని ఆయన చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసందే. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ జేఎసీ నేతలు సోమవారం నాడు తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు.