కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ ఏ కారణంతో పార్టీని వీడుతున్నారో తనతో చెప్పారని ఉత్తమ్ తెలిపారు.

వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతారని.. ఏఐసీసీ సమావేశంలో రాజగోపాల్ అంశంపై మరోసారి చర్చిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ వ్యాఖ్యానించి.. దాదాపుగా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు కోమటిరెడ్డి.

గురువారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, అనుచరులతో ఆయన సమావేశం కానున్నారు. వీరితో చర్చించిన అనంతరం పార్టీ మార్పుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో బీజేపీ ఎంపీలు బల్లలు చరిచి అభినందించడం.. ఆయనను వెల్‌కమ్ టూ బీజేపీ అని కామెంట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.