షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి మాట తప్పినందుకే టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను జనం ఓడించారని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం ఎల్లారెడ్డిలో జరిగిన మన ఊరు - మన పోరు బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మన ఊరు మన పోరు కార్యక్రమంలో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. వరి ధాన్యం కొనుగోలుపై పోరాటం చేశామని ఆయన పేర్కొన్నారు. నల్లమడుగు సురేందర్‌ను గెలిపిస్తే టీఆర్ఎస్ పంచనల చేరాడంటూ రేవంత్ ఫైరయ్యారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడి మోడీ మెడలు వంచారని ఆయన ప్రశంసించారు. ఎంపీగా గెలిస్తే వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కవిత (kalvakuntla kavitha ) మాట ఇచ్చారంటూ రేవంత్ దుయ్యట్టారు. మాట ఇచ్చి తప్పింది కాబట్టే నిజామాబాద్ రైతులు కవితను ఓడించారంటూ ఆయన ఎద్దేవా చేశారు.