కుటుంబ సమస్యల్లో సీఎం కేసీఆర్ ఉన్నారని గవర్నర్ చెప్పారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. గవర్నర్ తో సఖ్యత లేనందున కేటీఆర్ నుు సీఎం చేయడం సాధ్యం కాదని ఫ్యామిలీ మెంబర్లను ఒప్పించే పనిలో ఉన్నారన్నారు.
హైదరాబాద్: గవర్నర్ తో సఖ్యత లేనందున KTR ను సీఎం చేయడం కుదరదని కుటుంబ సభ్యులను ఒప్పించే పనిలో కేసీఆర్ ఉన్నారని టీపీసీసీ చీఫ్ Revanth Reddy చెప్పారు. శుక్రవారం నాడు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. KCR కుటుంబ సమస్యల నుండి బయటపడే పనిలో ఉన్నారని Governor చెప్పారని ఆయన గుర్తు చేశారు. గవర్నర్ Tamilisai Soundararajan ఢిల్లీ పర్యటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయన్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏ పార్టీ అని ఆయనకు టీఆర్ఎస్ ఓటేసిందని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏ పార్టీ అని ఆయనకు ఓటేశారో చెప్పాలన్నారు. కానీ గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ కు ఎందుకు ఈ అనుమానాలు వచ్చాయో చెప్పాలని ఆయన కోరారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్ కి కోపం వస్తోందని బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉగాది వేడుకలకు హాజరు కాలేదా అని ఆయన అడిగారు.
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 గవర్నర్ కు విశేష అధికారులను ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు. సెక్షన్ 8 ఆధారంగా డ్రగ్స్ విషయమై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. Section 8 పరిధిలో ఉన్న ఏ అంశంపైనైనా గవర్నర్ ఫైనల్ చేయొచ్చన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు గవర్నర్ చేయొచ్చన్నారు. GHMC పరిధిలో ఏదైనా సమీక్ష చేసే అధికారం గవర్నర్ కు సెక్షన్ 8 కట్టబెట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య, వైద్యం, డ్రగ్స్ పై కూడా గవర్నర్ సమీక్ష చేయవచ్చన్నారు. తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి ఈ వ్యవస్థలను సరిదిద్దాలని రేవంత్ రెడ్డి గవర్నర్ ను కోరారు.
ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు గవర్నర్ పై నిందలు వేస్తుందన్నారు. విద్య, వైద్య రంగాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారన్నారు. ఆసుపత్రుల్లో కుక్కలు, పిల్లులు పెత్తనం చెలాయిస్తున్నాయని చెప్పడమంటే ఆరోగ్య శాఖ ఎంత దుర్భరంగా ఉందో అర్ధమౌతుందని చెప్పారు.
