Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బీఆర్ఎస్ గెలిచింది : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రేషన్ షాపులో 9 వస్తువులు వచ్చేవన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రేషన్ షాపులో బియ్యం తప్పించి ఏం రావడం లేదన్నారు. ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బీఆర్ఎస్ గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

tpcc chief revanth reddy sensational comments on brs and cm kcr at dharmapuri ksp
Author
First Published Nov 11, 2023, 4:51 PM IST

కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు రేషన్ షాపులో 9 వస్తువులు వచ్చేవన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శనివారం ధర్మపురిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఈవీఎంలు మార్చి ధర్మపురిలో బీఆర్ఎస్ గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అట్లూరి లక్ష్మణ్‌ను ఓడించడానికి కేసీఆర్ కుట్రలు చేశారని రేవంత్ అన్నారు. ధర్మపురిలో గెలిచిన అభ్యర్ధి మీ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గానికి ఏం చేయని కొప్పుల ఈశ్వర్ మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో రేషన్ షాపులో బియ్యం తప్పించి ఏం రావడం లేదన్నారు. 

అంతకుముందు  బెల్లంపల్లి‌లో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ‌లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ  సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారని విమర్శించారు. రూ. 38 వేల కోట్లతో నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రూ. 1.5 లక్షల కోట్లకుపెంచారని అన్నారు. ఎవరైనా ఇసుక మీద బ్యారేజ్ కడతారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏమైనా పేకమేడనా? అద్దాలు మేడనా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వానొస్తే ఇసుక కదిలిందని అధికారులు చెబుతున్నారని మండిపడ్డారు. 

ALso Read: ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే.. ధరణి కంటే మంచి పోర్టల్ తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి భూములు అమ్ముకున్నారని విమర్శించారు. దుర్గం చిన్నయ్య  కబ్జా కోరని, అతడికి ఆడపిల్ల కనిపిస్తే అంతేనని విమర్శించారు. వంద కేసులు ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 2004లో 9 గంటల విద్యుత్ ఇచ్చామని చెప్పారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. 

ధరణి పోతే రైతుబంధు రాదని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పారు. ధరణి కంటే మంచి పోర్టల్ తీసుకు వస్తామని.. రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు అమలు చేస్తామని తెలిపారు. మాట తప్పని ఉక్కు మహిళ సోనియా గాంధీ అని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు చూస్తే షాక్ కొడుతుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios