టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. మొసలి కన్నీరు కార్చడంలో కేసీఆర్ దిట్ట అంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: TRS ఎమ్మెల్సీ Kalvakuntla Kavitha కు టీపీసీసీ చీఫ్ Revanth Reddy కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి కవిత వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. మొసలి కన్నీరు కార్చడంలో మీ పార్టీ నాయకత్వం ప్రావీణ్యం సాధించిందని పరోక్షంగా కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు వేశారు.. Telangana కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను, తెలంగాణ తల్లిని ప్రధాని Narendra Modi అవమానించినప్పుడు మీ నాయకుడు ఎందుకు మౌనంగా ఉన్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Rahul Gandhi, Congress పార్టీ నాయకత్వాన్ని BJP అవమానించింది. ఆ సమయంలో మీ పార్టీకి మద్దతుగా కేసీఆర్ మాట్లాడారని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలకు గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అసోం సీఎం చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఖండించారని కవిత ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో గౌరవప్రదమైన రాజకీయాలను కేసీఆర్ నిలబెట్టారని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు రేవంత్ రెడ్డి మంగళవారం నాడు కౌంటరిచ్చారు. .
అంతకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ Manickam Tagore కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్య ట్వీట్ వార్ జరిగింది. ప్రజల పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని కవిత చెప్పారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం సాగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేసీఆర్ అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ చేసిన ట్వీట్ కు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కొట్లాది మంది తెలంగాణ యువత, సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కోసం పని చేస్తూనే ఉంటుంది. కానీ ఏడేళ్లలో అలా జరగలేదు. అది నెరవేరాలంటే ఊసరవెల్లి టీఆర్‌ఎస్, మతతత్వ బీజేపీని ఓడించాలి. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి 2 పార్శ్వాలు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయగలదని మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు కవిత స్పందించారు.
