Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మేలుకో, లేకపోతే నేను దిగాల్సి వస్తోంది : విజయశాంతి వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్ధల అరాచకాలను కట్టడి చేసే విధంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడం హర్షనీయమని కొనియాడారు. ఇంతకాలం మొద్దు నిద్రపోతున్న తెలంగాణ విద్యాశాఖ సుప్రీం తీర్పుతోనైనా మేలుకుని విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. 

tpcc campaign committee chairman vijayashanthi fires on cm kcr
Author
Hyderabad, First Published Jul 2, 2019, 3:50 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. విద్యారంగంలో కార్పొరేట్ దోపిడీని అరికట్టేలా ఫీజు నియంత్రణ చేపట్టాలని లేని పక్షంలో తాను ప్రత్యక్షంగా పోరాటానికి దిగేందుకు వెనుకాడనని హెచ్చరించారు. 

తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్ధల అరాచకాలను కట్టడి చేసే విధంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడం హర్షనీయమని కొనియాడారు. ఇంతకాలం మొద్దు నిద్రపోతున్న తెలంగాణ విద్యాశాఖ సుప్రీం తీర్పుతోనైనా మేలుకుని విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరారు. 

కార్పొరేట్ విద్యాసంస్ధలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించడానికి కంటితుడుపుగా ఓ కమిటీని వేసి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. దీంతో గత ఐదేళ్లుగా కేజీ నుంచి పీజీ వరకు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్ధలు స్వైర విహారం చేస్తున్నాయని మండిపడ్డారు విజయశాంతి.  

ఇప్పటికైనా ఫీజు నియంత్రణ కోసం నియమించిన కమిటీలు స్వేచ్ఛగా పనిచేసేందుకు అవకాశమిచ్చి, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను పోరాటానికి దిగాల్సి వస్తోందని విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios