Asianet News TeluguAsianet News Telugu

రేపటినుంచి తెలంగాణలో 139 కేంద్రాలలో కరోనా వ్యాక్సినేషన్..

తెలంగాణలో రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. మొత్తం 139 కేంద్రాలలో ఈ వాక్సినేషన్ జరగనుంది. రేపు ఉదయం జిల్లా కేంద్రాల నుంచి టీకా సెంటర్లకు వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4170 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. 

tomorrow vaccination starts in 139 centers in Telangana - bsb
Author
Hyderabad, First Published Jan 15, 2021, 11:37 AM IST

తెలంగాణలో రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతోంది. మొత్తం 139 కేంద్రాలలో ఈ వాక్సినేషన్ జరగనుంది. రేపు ఉదయం జిల్లా కేంద్రాల నుంచి టీకా సెంటర్లకు వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4170 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. 

ఇందులో మొదటి విడతగా మొదటి వారం రోజుల పాటు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఆ తరువాత దశల వారీగా ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. 

ఇదిలా ఉండగా వాక్సినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గాంధీ, నార్సింగి కేంద్రాల్లో వ్యాక్సిన్ లబ్దిదారులతో ప్రధాని మోదీ వర్చువల్ ఇంటరాక్షన్ జరగనుంది. 

దీంతోపాటు ప్రతి వ్యాక్సిన్ కేంద్రంలో రియాక్షన్ కంట్రోల్ మెడిసిన్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద అందుబాటులో సీనియర్ డాక్టర్లుంటారు. అత్యవసర వైద్యం కోసం 57 ఆసుపత్రుల్లో 570 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios