హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తుది ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. 

119 నియోజకవర్గావల్లో గెలిచేది ఎవరు..ఓడేది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనే ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటర దేవుడు తీర్పు ఎలా ఉందోనని ఎవరిని కరుణిస్తోందనని అన్ని పార్టీల అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

ఈ ఎన్నికల ఫలితాలపై నువ్వా నేనా అన్న రేసులో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రజాకూటమిలు ఓటరు తీర్పుపై బరిగీసుకుని కూర్చున్నాయి. అయితే ఈ ఎన్నికలు తమకు ఏ మాత్రమైనా కలిసి వస్తాయా అంటూ ఆరు జాతీయ పార్టీలతోపాటు 30 ప్రాంతీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. 

తమను పార్టీలు తిరస్కరిస్తే ప్రజలు తమను ఆదరిస్తారని 652 మంది ఇండిపెండెంట్లు నమ్మకంతో ఉన్నారు. అయితే ఎవరిది గెలుపు  ఎవరిది ఓటమి అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. 

ఇకపోతే 2,379 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతి రౌండ్‌లో 14వేల ఓట్ల వరకు ఫలితాలు వస్తాయని చెప్పారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు ఉంటాయని, అత్యల్పంగా బెల్లంపల్లిలో 15 రౌండ్లలో కౌంటింగ్‌ జరుగుతుందని చెప్పారు. లెక్కింపు అధికారులను రాండమ్‌ విధానంలో కేటాయిస్తున్నామన్నారు. అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని స్పష్టంచేశారు.

అటు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ ను అమలు చేసింది. అలాగే అన్ని పోలింగ్ బూత్ ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. ఒక్కో పోలింగ్ బూత్ వద్ద కనీసం 100 మందితో భద్రతను ఏర్పాటు చేసింది.ఒక్కో నియోజకవర్గం వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంచినట్లు పోలీస్ శాఖ్ స్పష్టం చేసింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల పరిధిలో 43 కౌంటింగ్ కేంద్రాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో 13 పోలింగ్ కేంద్రాలతోపాటు మిగిలిన 31 జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, త్రివిధ దళాల్లో పనిచేసిన సర్వీసు ఓట్లను లెక్కించనున్నట్లు సిఈవో రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఒక్కోలెక్కింపు కేంద్రంలో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు ఉన్నతాధికారులు. 
 
అయితే తొలి ఎన్నికల ఫలితం భద్రాచలం నియోజకవర్గంలో తేలనున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో కేవలం 161 పోలింగ్‌ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో తొలిఫలితం ఇక్కడ నుంచే వెలువడ నుంది. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి విజేత ఎవరనేది తేలిపోనుంది. 

ఇకపోతే రాష్ట్రంలోనే అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గంలో 580 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఫలితం కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. 

20 రౌండర్ల తర్వాత కానీ ఫలితం వెలువడే అవకాశం లేదు. అలాగే శేరిలింగంపల్లితోపాటు పెద్ద నియోజకవర్గాలైన మేడ్చల్‌, ఎల్బీనగర్‌, మల్కాజ్‌గిరి స్థానాలకు కూడా 20 రౌండ్లు పూర్తైతే కానీ ఫలితం వెలువడే అవకాశం లేదు.  

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు.  
 
అయితే లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ పలు ఆంక్షలు విధించింది. లెక్కింపు ప్రక్రియంతా రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో కొనసాగుతుంది. ప్రతి టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని రజత్ కుమార్ తెలిపారు. 

కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో రాండమ్‌ పద్ధతిలో ఏదైనా ఒక వీవీప్యాట్‌లో ముద్రిత ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్‌ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. 

సీసీ టీవీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని రజత్ కుమార్ తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించేది లేదని స్పష్టంచేశారు. భద్రతపై విపక్షాలు అనుమానాలు లేవనెత్తిన దృష్ట్యా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల పోలీసు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు ఇవే:
1. హైదరాబాద్ పరిధిలో పోలింగ్ కేంద్రాలు 
     ముషీరాబాద్, నాంపల్లి - ఎల్బీ స్టేడియం
     మలక్ పేట -జీహెచ్ఎంసీ గ్రౌండ్, అంబర్ పేట 
     అంబర్ పేట-రెడ్డి కాలేజీ నారాయణగూడ.
     ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్ గూడ
     కార్వాన్ - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్ 
     గోశామహాల్ - కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం 
     చార్మినార్ - కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి
     చంద్రాయణగుట్ట - నిజాం కాలేజీ
     యకుత్ పుర - సరోజిని నాయుడు కాలేజీ, నాంపల్లి
     బహదూర్ పుర - సాంకేతిక విద్య భవన్, మాసబ్ ట్యాంక్.
     సికింద్రాబాద్ -పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
     కంటోన్మెంట్ - సీఎస్ఐఐటీ వెస్లీ కాలేజ్, 
 
2.కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
   సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ 

3. మంచిర్యాల 
   ఏఎంసి గోదాం, మంచిర్యాల


4. ఆదిలాబాద్ 
టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ 
5. నిర్మల్ 
   పాలిటెక్నిక్ కాలేజీ 
6. నిజామాబాద్ 
    గౌర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ 
7. కామారెడ్డి 
    ఏఎంసి గోదాం 
8.  జగిత్యాల 
    వీఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ 
9. పెద్దపల్లి 
   జేఏన్టీయూ హెచ్,మంతని 

 10. కరీంనగర్ 
       ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల 
11. సిరిసిల్ల 
      సోషల్ వెల్ఫేర్ స్కూల్, తంగళ్ళపల్లి 
12.  సంగారెడ్డి
      గీతం యూనివర్సిటీ 
13. మెదక్ 
      వైపీఆర్ కాలేజ్ ఎడ్యుకేషన్ 
14.  సిద్దిపేట 
      ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 
15. రంగారెడ్డి:
      ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్ నగర్ - బీసీ రెసిడెన్షియల్ స్కూల్, పాలమాకుల,
       

రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి - ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాలమాకుల
16. వికారాబాద్ 
      అగ్రికల్చర్ మార్కెట్ గోదాం 

17.  మేడ్చల్ 
      హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, కీసర


18. మహబూబ్ నగర్
 నారాయణపేట, మహాబూబ్ నగర్, జడ్చర్ల - జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం ధర్మపుర్
  దేవరకద్ర, మక్తల్ -జేపీ కాలేజ్, అబ్దుల్ కలాం బిల్డింగ్ 

19.  నాగర్ కర్నూల్  
       అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నెల్లికొండ

20. వనపర్తి  
     న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్ 


21.  జోగులంబా గద్వాల  
      ఓల్డ్ బిల్డింగ్, ఎస్కేటీఆర్ కాలేజ్ 

22. నల్గొండ  
       టీఎస్ హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్, దుప్పల్లాపల్లి

23. సూర్యాపేట 
       ఏఎంసి గోదాం 

24. యాదాద్రి  
     అరోరా ఇంజినీరింగ్ కాలేజీ, భువనగిరి

25. జనగామ 
      వీబీఐటి, పెంబర్తి 

26. మహబూబాబాద్ 
     ఫాతిమా హై స్కూల్, 


27. వరంగల్ రూరల్
      ఏఎంసి యార్డు, ఏనుమాముల 

28. వరంగల్ అర్బన్
     ఎమ్.ఎల్ ఎస్. గోదాం, ఎ ఏనుమాముల 

29.భూపాలపల్లి 
    అంబెడ్కర్ స్టేడియం,  

30. కొత్తగూడెం  
      అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీ, పాల్వంచ

31.  ఖమ్మం 
     విజయ ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం