తెలంగాణలో కరోనా కేసులు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేవలం 293మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. తాజాగా గత 24గంటల్లో(శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 33,258మందికి కరోనా టెస్టులు చేయగా కేవలం 293మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరితే టెస్టుల సంఖ్య 74,61,68కు చేరాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 379 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,85,898కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 4,191 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 2,395గా వుంది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1577కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 98.02శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే నారాయణపేటలో కేసులేవి బయటపడలేదు. ఇక జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 3, ఆదిలాబాద్ 8, భూపాలపల్లి 6, జనగామ 2, జగిత్యాల 8, వనపర్తి 2, అసిఫాబాద్ 1, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 3, మెదక్ 5, నాగర్ కర్నూల్ 2, నిర్మల్ 2, నిజామాబాద్ 5, సిరిసిల్ల 7, వికారాబాద్ 4, వరంగల్ రూరల్ 8, ములుగు 4, పెద్దపల్లి 9, సిద్దిపేట 10, సూర్యాపేట 7, భువనగిరి 5, మంచిర్యాల 11, నల్గొండ 10 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 108కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 57, రంగారెడ్డి 18, కొత్తగూడెం 11, కరీంనగర్ 24, ఖమ్మం 10, సంగారెడ్డి 11, వరంగల్ అర్బన్ 10కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

Scroll to load tweet…