Asianet News TeluguAsianet News Telugu

మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగంలో తెలంగాణ టాప్: ఎన్ఎఫ్‌హెచ్ఎస్ సర్వే

ఆల్కహాల్, పొగాకు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలోని 43 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మద్యం తాగుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.

Tobacco alcohol use high in rural areas lns
Author
hyderabad, First Published Dec 13, 2020, 12:50 PM IST

హైదరాబాద్: ఆల్కహాల్, పొగాకు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలోని 43 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు మద్యం తాగుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5) సర్వే ఈ నివేదిక తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 27,351 గృహల్లో 27,518 మహిళలు, 3,863 పురుషులపై సర్వే నిర్వహించింది.

రాష్ట్రంలో 22.3 శాతం మంది పొగాకు ఉత్పత్తులను తింటున్నారని తేలింది. 34.3 శాతం మంది మద్యం సేవిస్తున్నారని తేలింది. మహిళలు 5.6 శాతం పొగాకు ఉత్పత్తులను తింటున్నారని సర్వే తెలిపింది. 6.7 శాతం మహిళలు మద్యం తాగుతున్నారని ఈ సర్వే తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో  ప్రతి ముగ్గురిలో ఒకరు మద్యం సేవిస్తున్నారు. 2019-20 ఏడాదికి సంబంధించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 డేటాను  కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే మద్యం తాగుతున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios