కల్వకుర్తి: టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని  వెల్దండ వద్ద పోలీసులు  ఆయనను అరెస్ట్ చేసి   పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కోదండరామ్ తో పాటు కాంగ్రెస్ నేత కోదండరెడ్డిలు నల్లమలకు వెళ్తుండగా  పోలీసులు అరెస్ట్  చేశారు ఎలాంటి నిషేధం లేని సమయంలో ఎందుకు తమను నల్లమలకు వెళ్లకుండా అడ్డుకొంటున్నారని కోదండరామ్ పోలీసులను ప్రశ్నించారు.

శాంతి భద్రతలకు ఆటంకం కల్గించకుండానే నల్లమలలో యురేనియం నిక్షేపాల తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు వెళ్తున్నట్టుగా ఆయన చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని రాతపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోదండరామ్ పట్టుబట్టారు. రోడ్డుపై బైఠాయించారు. 

దీంతో ట్రాఫిక్ కు అంతరాయమేర్పడింది. పోలీసులు కోదండరామ్ తో పాటు కాంగ్రెస్ నేత కోదండరెడ్డిని కూడ అరెస్ట్ చేసి వెల్దండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

"