కోవిడ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్లైన్ క్లాసులోకి ఆకతాయిలు జొరబడి.. క్లాసులను ఇబ్బంది పెట్టడమే కాకుండా.. ఇటీవలి కాలంలో ఈ తరహా ఉదంతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్‌ బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు.

 ఆమె తన విద్యార్థులకు ఆన్లైన్లో ఇంగ్లీష్ పాఠం చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఈ క్లాసులోకి ప్రవేశిస్తున్నారు. అసభ్య అశ్లీల ఫోటోలను పోస్టు చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.  దీనిపై ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఆన్లైన్ క్లాసులో ఉన్న విద్యార్థుల్లో ఎవరో ఒకరి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సదరు ఆకతాయిలకు తెలిసి ఉంటాయని, అలా ఆన్లైన్ క్లాస్ లోకి చొరబడగలుగుతున్నారని అధికారులు చెబుతున్నారు.