మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో  చిత్ర హింసలకు గురిచేశారు. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఈసీ నగర్ కు చెందిన లింగస్వామి అనే వ్యక్తి ఓ మహిళో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుషాయిగూడ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారించారు. మరుసటి రోజు రమ్మని చెప్పి పంపేశారు.

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు లింగస్వామిని మాట్లాడదామని కారులో తీసుకెళ్లారు. చర్లపల్లి ఈసీ నగర్ లోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో లింగస్వామి నోట్లో గుడ్డలు కుక్కి చితకబాదారు. ఆ రాత్రి మొత్తం కారులో తిప్పి  బాగా కొట్టి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రావటంతో బాధితుని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.