జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో నలుగురు ఉన్నారు. వారిలో ఒకరు ఈత కొడుతూ బయటకు వచ్చారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేడిపల్లి - కట్లకుంట మధ్యలో ఆ ప్రమాదం జరిగింది. అమరేందర్ అనే న్యాయవాది కుమారుడు ఈత కొడుతూ బయటకు వచ్చాడు. నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు. 

వారంతా ఓ జాతరకు బయలుదేరారు. కారు అతి వేగంగా కాలువలోకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.