విద్యుత్ వైర్ల దొంగతనానికి వెళ్లి కరెంట్ షాక్ తో దొంగ చనిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం  మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్ళితే కర్ణాటక రాష్టం బీదర్ ప్రాంతాన్ని చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతంలో ఉండే కంపెనీ లకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మ ల ను పగలగొట్టి, వాటి లో ఉండే రాగి తీగను దొంగతనం చేసేవారు. 

అదేవిధంగా మల్కాపూర్ గ్రామ శివారు లోని సిమెంట్ ఇటుకల కంపెనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ ను కరెంట్ ని ఆపేసి ,రాగి తీగను దొంగతనం చేయడానికి  ఈ నెల 19 వ తేదీన ప్రయత్నం చేయగా ,ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారం కావడంతో ముగ్గురు దొంగలలో సంగమేశ్వర్ (22) అనే దొంగ అక్కడే మృతి చెందాడు. షాక్ తో మిగతా ఇద్దరు పరారీ అయ్యారు. 

మళ్ళీ రెండు రోజుల తరువాత ఆ మృతదేహాని తీసుకెళ్లడానికి ప్రయత్నించినాకుదరలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీ ఊరికి చివరన ఉండడటంతో కంపెనీ వాళ్ళు కుడా చూడలేదు. మృతదేహాని తీసుకపోవడం కష్టంగా మారడంతో మిగతా ఇద్దరు దొంగలు ఛాదర్ ఘాట్ లోని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ నమోదు చేశారు. పోలీస్ లు ఈ కేసులో పలు కోణాల్లో విచారణ చేయగా, పిర్యాదు దారులు పొంతన లేని సమాధానాలు చెప్పారు.

 దీంతో  అనుమానం వచ్చిన పోలీస్ లు పిర్యాదుదారులని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఛాదర్ ఘాట్  పోలీస్ లు చౌటుప్పల్ పోలీస్ లకి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు. ఇక కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.