నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా జలాల్ పూర్ లో గ్రామస్థులు ఓ యువకుడిని కొట్టి చంపారు. దొంగతనాన్ని వచ్చిన ఆ యువకుడిని గ్రామస్థులు తీవ్రంగా కొట్టారు. దీంతో అతను మరణించాడు. అతన్ని సంతక్ తండాకు చెందిన కేతావత్ రాజుగా గుర్తించారు. 

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ గ్రామానికి రాజు దొంగతనం కోసం వచ్చాడు. గ్రామస్థులు గుర్తించి అతన్ని పట్టుకుని కర్రలతో కొట్టారు. రాళ్లతో కూడా మోదారు. తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మరణించాడు. 

దీంతో సంతక్ తండాకు వచ్చిన గ్రామస్థులు జలాల్ పూర్ వచ్చి తగాదాకు దిగారు. దొంగతనానికి వస్తే పట్టుకుని పోలీసులకు అప్పగించాలి గానీ కొట్టి చంపుతారా అని నిలదీశారు. దీంతో ఇరు గ్రామాల ప్రజల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. 

దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు దహన సంస్కారాలను జలాల్ పూర్ లోనే నిర్వహిస్తామని సంతక్ తండా గ్రామస్థులు అంటున్నారు. తాము కొట్టడం వల్లనే రాజు చనిపోయాడని జలాల్ పూర్ గ్రామస్థులు కూడా చెబుతున్నారు.