విజయ్ భార్య వనితా రెడ్డి ఐటమ్ సాంగ్స్ చేసిందా?

The movie background of comedian vijays wife vanitha reddy
Highlights

  • కమెడియన్ విజయ్ భార్య కూడా సినీ నటి
  • గతంలో అనేక సినిమాల్లో నటించిన వనితారెడ్డి
  • ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించిన వనిత
  • ప్రస్తుతం టివి సీరియల్స్ లో నటిస్తున్న వనితారెడ్డి

ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ భార్యపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.

విజయ్ ఆత్మహత్యకు వనితారెడ్డే కారణమని విజయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గత రెండు రోజుల క్రితం విజయ్ ఇంటికి వచ్చి బెదిరించి కార్ కూడా తీసుకుపోయిందని తల్లిదండ్రులు ఆరోపించారు.

వనితారెడ్డితోపాటు శశిధర్ అనే వ్యక్తి కూడా తనను వేధింపులకు గురిచేశారని విజయ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ సతీమణి మీడియా ముందుకొచ్చి చాలా విషయాలు వెల్లడించింది.

విజయ్ కి అక్రమ సంబంధం ఉందని, అందుకే తాను దూరంగా ఉంటున్నానని వెల్లడించింది.

తమ మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నయని తెలిపింది.

అయితే వనితారెడ్డి కూడా గతంలో ఫిల్మ్ స్టార్ గా నటించినట్లు తెలుస్తోంది. ఆమె పలు సినిమాల్లో నటించారు.

అబ్బో ఆడవాళ్ళు చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అనుమానాస్పదం అనే సినిమాలోనూ నటించింది.

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది.

ఇప్పుడు సినిమాల్లో అంతగా పాత్రలు రాకపోవడంతో ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తోందని తెలుస్తోంది.

ఈమెతో వచ్చిన గొడవల కారణంగానే విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

వనితారెడ్డి చేసిన ఐటమ్ సాంగ్ కింద లింక్ లో చూడొచ్చు.
 

loader