హైదరాబాద్:తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక పదోతరగతి విద్యార్థి రవికిరణ్  సోమవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

హైద్రాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో రవికిరణ్ 10వ తరగతి చదువుతున్నాడు. రవికిరణ్‌ గ్రీన్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.తోటి విద్యార్థులు రవి కిరణ్ ను డబ్బులు తేవాలని వేధించారు. దీంతో  తల్లిదండ్రులకు తెలియకుండా రూ. 6 వేలను రవికిరణ్ తోటి విద్యార్థులకు ఇచ్చాడు.

మళ్లీ డబ్బులు ఇవ్వాలని రవికిరణ్‌ను  విద్యార్థులు వేధించారు. దీంతో రవికిరణ్  ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

దీంతో రవికిరణ్ సూసైడ్ నోటు రాసి పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు రవికిరణ్‌ను ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సి అందిస్తున్నారు. ఈ విషయమై బాధితుడి కుటుంబసభ్యులు  పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.