ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష నేతల నిరసన దీక్షలో గందరగోళం నెలకొంది. సీటు కోసం కొట్టాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ మనుమంతరావు.. కిందపడిపోయారు.

ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్ష నేతల నిరసన దీక్షలో గందరగోళం నెలకొంది. సీటు కోసం కొట్టాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ మనుమంతరావు.. కిందపడిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొని 28మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలో... అఖిలపక్షాలు అన్నీ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సీటు కోసం గందగోళం నెలకొంది. 

కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు కూర్చనేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తకు, వీహెచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కార్యకర్తపై వీహెచ్‌ తన చేతిలోని మైక్‌తో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా అతడు వీహెచ్‌పైకి దూసుకెళ్లాడు. 

ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో వీహెచ్‌ కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు కిందపడిపోయిన వీహెచ్‌ను పైకి లేపారు. ఇద్దరి మధ్య సయేధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వచ్చినప్పుడు ఓ కార్యకర్త ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.