గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం ఇర్కిచెడులో అంబేద్కర్ విగ్రహం విషయం బీసీలు, దళితుల మధ్య ఘర్షణకు దారి తీసింది. గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు.
గద్వాల: Gadwal జిల్లాలోని కేటీ దొడ్డి మండలం Irkichedu లో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. అంబేద్కర్ విగ్రహం విషయమై ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకొంది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
ఇర్కిచెడులో Ambedkar విగ్రహం ఏర్పాటు కోసం దళితులు ప్రయత్నించారు. ఈ విషయమై దళితులకు మరో వర్గానికి మధ్య వివాదం చెలరేగింది. అంబేద్కర్ విగ్రహనికి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకొంది., ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
తమ స్థలంలో అంబేద్కర్ విగ్రహన్ని పెట్టడాన్ని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా కూడా అక్కడే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంతో నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. మంటలను దళితులు ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.ఇరు వర్గాలను అదుపు చేసే క్రమంలోనే ఓ పోలీసుకు కూడా గాయాలయ్యాయని సమాచారం.
పోలీసుల లాఠీచార్జీ
ఇర్కిచెడులో అంబేద్కర్ విగ్రహం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఇరు వర్గాలు విగ్రహం విషయంలో వాదనకు దిగారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో కవరేజీకి వెళ్లిన ఓ తెలుగు న్యూస్ చానెల్ ప్రతినిధికి గాయాలయ్యాయి. మరో వైపు ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన మీడియా ప్రతినిధికి తొలుత గద్వాల ఆసుపత్రిలో చికిత్స చేశారు. వైద్యుల సూచన మేరకు ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ కు తరలించారు.
