హైదరాబాద్:  టీపీసీసీ చీఫ్ నేత ఎంపిక విషయంలో ఆఖరి నిమిషంలో నిలిచిపోయిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

 టీపీసీసీ చీఫ్ పదవికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని, క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్ గా రేవంత్ రెడ్డి పేర్లను ఖరారు చేశారనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మంగళవారం నాడే కొత్త పీసీసీ చీఫ్ నేతను ప్రకటిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రకటన ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.

కీలకమైన రెండు పదవులను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే ఎలా అంశంపై  పార్టీకి చెందిన సీనియర్ నేత జానారెడ్డి ఎఐసీసీ నేతలతో మాట్లాడినట్టుగా సమాచారం. ఈ విషయమై ఎఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో జానారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.

ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీ వద్ద పంచాయితీ  రాహుల్ గాంధీ వద్దకు చేరుకొందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు సాగుతోంది. ఇతర సామాజిక వర్గాలకు కూడ పార్టీ పదవుల్లో  ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ కూడా నెలకొంది.

also read:కొత్త సంవత్సరంలోనే: టీపీసీసీ చీఫ్ కొత్త నేత ఎంపిక

ప్రచార కమిటీ క్యాంపెయిన్ ఛైర్మెన్  పదవిని తీసుకొనేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించారు. అయితే పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డికి ఏ మేరకు సహకరిస్తారనే చర్చ కూడ నెలకొంది. ఈ విషయమై రేవంత్ వర్గీయులు అనుమానాలు వ్యక్తం చేశారనే ప్రచారం కూడ నెలకొంది.

దీంతో సోనియాగాంధీ నుండి పీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన తాత్కాలికంగా నిలిచిపోయిందనే ప్రచారం కూడ నెలకొంది. మరికొందరు మాత్రం రెండు రోజుల్లో కొత్త పీసీసీ చీఫ్  నేతను ప్రకటిస్తారనే ప్రచారం కూడ సాగుతోంది.