Asianet News TeluguAsianet News Telugu

స్కాట్లాండ్​లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు తెలుగు విద్యార్థుల మృతి.. మ‌రోక‌రి ప‌రిస్థితి విష‌మం.. 

స్కాట్లాండ్‌లో కేసిల్ స్టాల్కర్ సమీపాన గత శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు మృతి చెందగా, మరో భారతీయ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.

Telugu students died in Road accident in Scotland 
Author
Hyderabad, First Published Aug 24, 2022, 5:31 AM IST

స్కాట్లాండ్​లో ఘోరరోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు సహా మరో బెంగళూరు విద్యార్థి మృతి చెందారు. మరో తెలుగు విద్యార్థికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్ర‌స్తుతం ఆ విద్యార్థి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. ఇప్పటికే ఘటనపై దర్యాప్తు  పూర్తి చేసిన త‌రువాత మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు స్కాట్లాండ్​ అధికారులు .

వివరాల్లోకిళ్తే.. స్కాట్లాండ్‌లో జరిగిన కారు  ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులుతో పాటు బెంగుళూర్ చెందిన మ‌రో విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఇద్ద‌రూ తెలుగు విద్యార్థుల్లో ఒక‌రూ హైదరాబాదీ కాగా.. మ‌రో తెలుగు విధ్యార్థి నెల్లూరు వాసి కాగా.. మరొక విద్యార్థి బెంగళూరుకు చెందినవారు. ఈ ప్ర‌మాదంలో తీవ్ర గాయాలపాలైన మరో విద్యార్థి హైద‌రాబాద్  చెందిన వ్య‌క్తి.. ప్రస్తుతం ఆ విద్యార్థి  ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు స్కాట్లాండ్ అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టినట్టు  స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు.  ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సమాచారం తెలిసివారు లేదా ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఎవరైనా ఉంటే వెంటనే తమకు సమాచారం తెలియజేయాలని ప్రకటన విడుదల చేశారు.

స్కాట్లాండ్‌ హైల్యాండ్‌లోని అప్పిన్‌ ప్రాంతంలో ఆగస్టు 19న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన పవన్ బషెట్టి (23), బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రహ్మణ్యం (23)  ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ లో ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. వీరి స్నేహితుడు, యూనివర్శిటీ మాజీ విద్యార్థి, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన సుధాకర్‌(30)తోపాటు హైదరాబాద్‌కు చెందిన  సాయివర్మ(24)  వీర‌ద్ద‌రూ.. గత శుక్రవారం కేసిల్ స్టాల్కర్ వద్ద ఎ 828 జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా.. ఓ భారీ వాహనం వీరిని ఢీ కోట్టింది. ఈ ప్ర‌మాదంతో హైదరాబాద్‌కు చెందిన పవన్‌ బాశెట్టి (23), ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన సుధాకర్‌(30)తోపాటు బెంగళూరుకు చెందిన గిరీష్‌ సుబ్రహ్మణ్యం(23)లుదీంతో వీరిలో ముగ్గురు అక్క‌డిక్క‌డే మర‌ణించారు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి వర్మ (24)కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆయనకు క్వీన్‌ ఎలిజబెత్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనపై స్కాట్లాండ్‌ పోలీసులు.. బాధిత కుటుంబాలకు స‌మాచారం అందిచారు. విహారయాత్రకు వెళ్లినట్లు భావిస్తోన్న ఈ నలుగురు విద్యార్థులున్న కారును ఓ భారీ వాహనం ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి భారత్‌కు పంపించేందుకు అక్కడి భారత కాన్సులేట్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ప్రవాస భారతీయ సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios