ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యువకుడు.. ప్రైవేట్ పార్టులపై కారం పోసి.. చివరికీ..
Telangana: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన యువకుడి పట్టుకుని చితకబాదారు. రహస్య భాగాలపై కారం పోసి కొట్టారు. వారి చిత్రహింసలకు తట్టుకోలేక ఆ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Telangana: హైదరాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. ఓ యువకుడు తన ప్రియురాలిని ఇంటికి వెళ్లి పట్టుబడ్డాడు. దీంతో ఆగ్రహనికి గురైన తల్లిదండ్రులు ఆ యువకుడ్ని చితక్కొట్టారు. ప్రైవేట్ పార్టుపై కారం కొట్టి దారుణంగా కొట్టారు. అలా దాదాపు గంట పాటు హింసలకు గురి చేయడంతో ఆ యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం మేడ్చల్ జిల్లా (Medchal) పోచారం ఐటీ కారిడార్ (It corridor) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. స్థానికంగా ఓ కాలనీకి నివాసిస్తున్న 18 ఏండ్ల అబ్బాయి.. 15 ఏండ్ల బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడ్ని మందలించారు. అయినా యువకుడు వారి మాటలను పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో బుధవారం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు బుధవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్లి కలిశాడు.
ఈ విషయం గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని యువకుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు. ప్రైవేట్ పార్టుపై కారం వేసి దాదాపు గంట సేపు చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.