తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిపై పోలీసుల సంచలన ఆరోపణలు చేశారు. అతను మావోయిస్ట్ పార్టీ రిక్రూట్మెంట్‌కి పాల్పడుతున్నాడని.. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో కొంతమంది టీవీవీ విద్యార్ధులను మావోయిస్టు పార్టీలో చేర్పించాడని పోలీసులు ఆరోపించారు.

దానితో పాటు మావోలకు నిధులు సరఫరా చేయడంతో పాటు సెంట్రల్ కమిటీకి చెందిన తెలంగాణ నేతలను మద్దిలేటి కలుస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో మావోల లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

మద్దిలేటితో పాటు మరో ఇద్దరు విద్యార్ధి నేతలు నాగన్న, బలరాంపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మద్దిలేటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.