BJP and TRS: వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ కు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని చూస్తున్న బీజేపీ.. అధికార పీఠ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌లో దూకుడుగా ముందుకు సాగుతోంది.   

BJP vs TRS: గ‌త కొన్నెండ్లు వెన‌క్కివెళ్తే తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌), భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేప)లు మిత్ర ప‌క్షాలుగా మంచి దోస్తాన్ లో ఉండేవి. అయితే, కాలంతో పాటు రెండు పార్టీ బద్ధ శత్రువులుగా మారాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా రెండు పార్టీ వైరం ముదిరింది. బీజేపీ, టీఆర్ఎస్‌ల మ‌ధ్య రాజ‌కీయ వైరం ఇలా ముద‌ర‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్‌) ఐదు సంవత్సరాల క్రితం భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు ఉత్సాహభరితమైన మద్దతుదారుగా ఉన్నారు. ఆయన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరచుగా పార్లమెంటులో కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వ‌చ్చింది. అయితే, ఇది ఒకప్ప‌టికీ క‌థ‌.. ఇప్పుడు ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంలో కేసీఆర్ కీలకంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో చురుగ్గా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ వ‌చ్చిన ఒక మాట‌కైనా ఆయ‌న‌ను ప‌ల‌క‌రించ‌డానికి వెళ్ల‌లేదు. శ‌నివారం నాడు ప్ర‌ధాని రానున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డానికి కూడా వెళ్ల‌డం లేద‌ని స‌మాచారం. అయితే, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైద‌రాబాద్ రాగా.. ఆయ‌న‌కు సీఎం కేసీఆర్‌, ఇత‌ర రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర మోడీ, అమిత్‌షా, జేపీ న‌డ్డా వంటి బీజేపీ అగ్ర‌నేత‌లంద‌రూ కాషాయ పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం కోసం న‌గ‌రానికి చేరుకుంటున్నారు. తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం తీసుకునే ఎజెండా ఇందులో ప్ర‌స్తావ‌న‌కు రానున్న‌ట్టు తెలిసింది. క‌మ‌ళం నేత‌లు సైతం కేసీఆర్ అండ్ స‌ర్కారుపై తీవ్రంగా వ‌మ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రాజ‌కీయ ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌చ్చే స‌ర్క‌స్ అంటూ టీఆర్ఎస్ బీజేపీ కౌంట‌ర్ ఇస్తోంది. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న‌ద‌నీ, నిధుల విష‌యంలో వివ‌క్ష‌ను చూపుతున్న‌ద‌ని టీఆర్ఎస్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ఎత్తిచూపుతూ వ‌స్తోంది. మ‌రోప‌క్క రాష్ట్రంలో బీజేపీ దుకుడుడా ముందుకు సాగుతూ.. అధికార పార్టీపై విమ‌ర్శ‌ల దాడిని మరింత‌గా పెంచింది. ఇది రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ పోరును పెంచింది. ఇక జాతీయ రాజ‌కీయాల‌పై కేసీఆర్ దృష్టిసారించ‌డం, ప్ర‌ధాని మోడీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గులాబీ-క‌మ‌ళంల మ‌ధ్య వైరాన్ని ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయికి చేర్చింది. 

2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో సభ్యుడిగా ఉంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల సంభావ్యతను పసిగట్టిన తర్వాత బీజేపీ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు దాడిని పెంచింది. 2019 పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు మాత్రమే గెలిచిన తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో ఆశ్చర్యకరమైన విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ బలహీనపడటంతో ప్రతిపక్ష స్థానాన్ని పూరించడానికి బీజేపీ ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లింది. రెండు కీలకమైన అసెంబ్లీలను గెలుచుకుంది. ఉపఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. ఈ క్ర‌మంలో మ‌రింత దూకుడును బీజేపీ పెంచింది. ఇది టీఆర్ఎస్ పార్టీకి త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే బీజేపీ-టీఆర్ఎస్ రెండు పార్టీలు రాజ‌కీయంగా బ‌ద్ద శ‌త్రువులుగా మారాయి. ఇక మున్ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌గాయో చూడాలి.. !