Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ స్టేషన్ కు సరదాగా ఎవరు రారు..: పోలీసుల తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Telangana State High Court : ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు విధి నిర్వహణలో తమ తీరును మార్చుకోవాలని, పోలీసులు పనిచేస్తున్నది ప్రజల కోసమేననీ,  వారిని భయాందోళనలకు గురిచేయడానికి కాదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

Telangana State High Court key comments on attitude of the police krj
Author
First Published Feb 17, 2024, 6:05 AM IST

Telangana State High Court: ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తమ తీరును మార్చుకోవాలని పేర్కొంది. పోలీసులు ఉన్నది ప్రజల కోసం.. వారిని భయాందోళనలకు గురిచేయడానికి కాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఇకపై ఎవరూ కోర్టులకు రాకుండా చూడాలని పోలీసులకు సూచించింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని ,ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం ప్రజలకు చాలా కష్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు మార్చుకోనేలా, వారి విధులను గుర్తు చేసేలా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీకి చెప్పాలని అదనపు ఏజీకి హైకోర్టు సూచించింది.

అసలేం జరిగింది ?  
  
పోలీసులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ.. ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసినా తమ ఫిర్యాదు చేసుకోలేదని .. కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు  కరీంనగర్ టూ టౌన్  ఎస్‌హెచ్‌వో ఓదెల వెంకటేశ్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ వాదనలు వినిపిస్తూ.. 14న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యాన్ని ప్రభుత్వ న్యాయవాది సమర్థించినందుకు వారి తరపున ఏఏజీ క్షమాపణ కోరారు. దీంతో ఎస్‌హెచ్‌వోను వదిలిపెట్టలేమని ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios