తెలంగాణ : ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ పోస్టలుకు 98,218 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో దాదాపు 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది అధికారులు తెలిపారు. సివిల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ పోస్టలుకు 98,218 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌కు 4,564.. ఎస్సై సివిల్ 43,708.. ఎస్సై ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 729 మంది.. డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ 1,779.. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుకు 1,153 మంది .. ట్రాన్స్‌పోర్ట్ ఎస్సై పోస్టులకు 463 మంది.. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్‌కు 283 మందికి అర్హత సాధించారు. కాగా.. ఎస్సై, కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ఏప్రిల్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.