Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ కి థ్యాంక్స్ చెప్పిన.. తెలంగాణ పోలీసులు

మెట్రో రైలు, రోడ్డు మార్గం ద్వారా శస్త్ర చికిత్స కోసం గుండెను గ్రీన్ ఛానెల్ పద్ధతిలో విజయవంతంగా తరలించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలని ట్వీట్ చేశారు. 

Telangana police Thanks to governor tamilsai soundarajan
Author
Hyderabad, First Published Feb 3, 2021, 1:52 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  కి రాష్ట్ర పోలీసులు దన్యవాదాలు తెలియజేశారు. సౌందర్య రాజన్ తాజాగా.. తెలంగాణ పోలీసులను అభినందించగా.. అందుకు ట్విట్టర్ వేదికగా స్పిందించి దన్యవాదాలు తెలియజేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. నగరంలోని కామినేని నుంచి అపోలో ఆసుపత్రికి గుండెను తరలించి.. గుండె ఆపరేషన్ విజయవంతంగా ముగియడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ట్వీట్ చేశారు. 

మెట్రో రైలు, రోడ్డు మార్గం ద్వారా శస్త్ర చికిత్స కోసం గుండెను గ్రీన్ ఛానెల్ పద్ధతిలో విజయవంతంగా తరలించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైద్యులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలని ట్వీట్ చేశారు. అంతేగాక ఇది ‘హైదరాబాద్ స్ఫూర్తి’ అంటూ హాష్ ట్యాగ్ పెట్టారు. ఈ ట్వీట్‌‌కు తెలంగాణ పోలీసులు తాజాగా రిప్లై ఇచ్చారు.  

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌ారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌లో త‌ర‌లించారు.

 నాగోలు మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారుల‌కు ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారం ఇవ్వ‌డంతో ఈ ఏర్పాట్లు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios