వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఇందిరా శోభన్ వైఎస్సార్ టీపీకి రాజీనామా చేశారు.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. వైఎస్సార్ టీపీకి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఆమె మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కలిసి కొట్లాడామని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలు కన్నామని, వాటిన సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన తనను ప్రజలు ఆశీర్వదిస్తునే ఉన్నారని ఆమె అన్నారు. 

ఈ రోజు తాను కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు, అది తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లుగానే షర్మిలక్క వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనారిటీ బాగు కోసం గిరిజనుల జీవితాల్లో వెలుగు కోసం, మహిళలకు సమాన వాటా కోసం కొట్లాడుతూనే ఉన్నానని ఇందిరా శోభన్ అన్నారు. 

తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటానని, అందుకు షర్మిలక్క వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజలు కోరుకున్నారని, వారి ఆకాంక్షల మేరక తాను వైఎస్సార్ టీపీకి రాజీనామా చేశానని ఆమె అన్నారు. 

త్వరలో తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె చెప్పారు. ప్రజా జీవితంలో ఉం్టానని, జనం కోసం కదులుతానని, ప్రజల కోసమే అడుగులు వేస్తానని ఇందిరా శోభన్ అన్నాిరు. ఇదే ఆదరాభిమానాలును, ఇక ముందు కూడా ప్రజల నుంచి తనకు ఉంటాయని, తనను నడిపించాలని ప్రజలో కోరుకుంటున్నానని ఆమె అన్నారు. ఇన్నాళ్లు వైఎస్సార్ టీపీలో తనకు సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.