తెలంగాణ ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి వెళితేనే దేశం బాగుపడుతుందని ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. అందువల్ల టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలు గెలిపించాలని...అప్పుడే టీఆర్ఎస్ కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించగల్గుతుందని అన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ ప్రధాని అయితే ఈ దేశ రూపురేఖలే మారిపోతాయని ఆయన అన్నారు. 

ఆదివారం సచివాలయంలో ఎక్సైజ్‌, పర్యాటకశాఖల మంత్రిగా శ్రీనివాస్ గౌడ్  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. అధికారులు కూడా ఎంతో బాధ్యతతో పనిచేస్తున్నట్లు... ఇకపై కూడా అలాగే చేయాలని మంత్రి  సూచించారు. 

తెలంగాణలో అత్యంత ఆదాయాన్నిచ్చే ఎక్సైజ్ శాఖను నమ్మకంతో తనకు కేటాయించిన ముఖ్యమంత్రికి శ్రీనివాన్ గైడ్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తానని అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన గీత  కార్మికులకు ఆదుకోడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంతకుముందే కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. వాటిని కొనసాగిస్తూనే వారికి మరింత అండదండలు అందిస్తామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.