తెలంగాణ మంత్రులు శ్రీనివాస గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కల్లు పార్టీ చేసుకున్నారు. కార్యక్రమానికి వెళ్తూ మధ్యలో తాటికల్లు సేవించారు. కల్లుగీత కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. 

"

జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావులు వెడుతున్నారు. మార్గమధ్యలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

గీత కార్మికులతో మాట్లాడుతూ ఉదయం పూటనే అప్పుడే దించిన సాంప్రదాయ తాటికల్లును సేవించి తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావులు అన్నారు.