బొజ్జలున్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు. తన లాగా ఫిట్‌గా వుంటేనే ప్రమోషన్ ఇవ్వాలని.. లేదంటే వాళ్లకు ప్రమోషన్ ఇవ్వొద్దని హోంమంత్రికి సలహా ఇచ్చారు మల్లారెడ్డి.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వుండే మంత్రి మల్లారెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులకు పొట్టలుంటే ప్రమోషన్లు ఇవ్వొద్దని హోంమంత్రికి రిక్వెస్ట్ చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ తప్పనిసరిగా జిమ్‌లు పెట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తన లాగా ఫిట్‌గా వుంటేనే ప్రమోషన్ ఇవ్వాలని.. లేదంటే వాళ్లకు ప్రమోషన్ ఇవ్వొద్దని హోంమంత్రికి సలహా ఇచ్చారు మల్లారెడ్డి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ దేశంలోనే నెంబర్‌వన్‌గా వుందని.. మన పోలీసులు బాగా పనిచేస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
ALso Read: ఓట్ల కోసం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు చీపుర్లతో కొట్టాలి: మంత్రి మల్లారెడ్డి
అంతకుముందు మంగళవారంనాడు నిజామాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం చేశారని మీకు ఓట్లు అడిగే హక్కుందా అని బీజేపీ, కాంగ్రెస్ నేతలనుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం వచ్చే విపక్ష నేతలను నిలదీయాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. మీ దగ్గర అరవింద్ ఎలా ఎంపీ అయ్యాడో తమ దగ్గర రేవంత్ రెడ్డి కూడా ఎంపీ అయ్యాడన్నారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రావడం లేదని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఓట్లు అడిగేందుకు వస్తే చీపుర్లతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
