పర్యటనకు 10 నిమిషాల ముందు సమాచారం ఇస్తే ప్రోటోకాల్ ఏర్పాట్లు ఎలా చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను ప్రశ్నించారు.

నిర్మల్: 10 నిమిషాల ముందు పర్యటన గురించి చెబితే ప్రోటోకాల్ కు సంబంధించి ఎలా ఏర్పాట్లు చేస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గవర్నర్ తమిళిపై సౌందర రాజన్ ను ప్రశ్నించారు.

తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan ఇటీవల Yadadri ఆలయానికి వెళ్లారు. అయితే ఆ స.మయంలో యాదాద్రి ఆలయ అధికారులు ఆమెకు Protocol ప్రకారంగా ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి Indrakaran Reddy స్పందించారు. ఆలయానికి వెళ్లడానికి ముందే ఈ విషయమై ముందే అధికారులకు సమాచారం ఇస్తే వారు ఏర్పాట్లు చేస్తారన్నారు.

ఆలయానికి బయలు దేరడానికి 10 నిమిషాల ముందు సమాచారం ఇస్తే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. Governor తమిళిసై సౌందర రాజన్ హుందాగా వ్యవహరించాలని ఆయన కోరారు. హుందాగా ఉంటేనే ఆమెకు గౌరవం ఉంటుందని చెప్పారు. గవర్నర్లుగా ఐఎఎస్, ఐపీఎస్ అధికకారులు ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చారన్నారు. రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ కు ఇచ్చే మర్యాదను తాము తప్పక ఇస్తామని ఆయన చెప్పారు. గవర్నర్ తమిళిసై BJP వైపే చూస్తారన్నారు. ఆమె మాటలను ఎవరూ కూడా నమ్మే పరిస్తితిలో లేరని ఆయన తేల్చి చెప్పారు.

మంగళవారం నాడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీకి చేరుకొన్నారు. బుధవారం నాడు ప్రధాని మోడీతో గవర్నర్ భేటీ అయ్యారు. గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.ఈ భేటీలు ముగిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. తమిళిపై గా కాకుండా రాజ్ భవన్ ను గౌరవించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకొంటానని ఆమె ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్ భవన్ గౌరవించాలని ఆమె కోరారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించినట్టుగా చెప్పారు. కేసీఆర్ సర్కార్ తనతో వ్యవహరించిన తీరును కూడా ఆమె ప్రస్తావించారు. 

గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాలపై తెలంగాణ గవర్నర్ సమయం వచ్చినప్పుడల్లా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

హూజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాడి కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పేరుకు సిపారస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కౌశిక్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్ తన వద్దే పెట్టుకొంది. కౌశిక్ రెడ్డిపై బీజేపీ సహా ఇతర పార్టీలు కూడా ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ప్రతిపాదించింది. గవర్నర్ కోటాలో మధుసూధనాచారికి టీఆర్ఎస్ సర్కార్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.

ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కూడా కేసీఆర్ సహా మంత్రులు హాజరు కాలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అయితే తొలుత బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తనకు సమాచారం అందించిందని , ఆ తర్వాత పొరపాటున ఆ సమాచారం పంపారని ప్రభుత్వం నుండి సమాచారం వచ్చిందని తమిళిసై ప్రకటించింది. టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగం లేకండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడాన్ని కూడా విపక్షాలు తప్పుబట్టాయి. 

రాజ్ భవన్ లో ఉగాది సంబరాలను గవర్నర్ నిర్వహించారు.ఈ సంబరాలకు కేసీఆర్ కు గవర్నర్ ఆహ్వానం పంపింది. అయితే ఈ సంబరాలకు కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ కూడా హాజరు కాలేదు. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరైన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలకలేదు.ప్రోటోకాల్ పాటించలేదు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఉగాది సంబరాల సమయంలో తాను ఎవరికీ కూడా తల వంచబోనని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సహా మంత్రులకు ఆహ్వానం పంపిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసింది.