Asianet News TeluguAsianet News Telugu

వీరాభిమాని ఇంటికి మంత్రి హరీష్ రావు: కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటో

తెలంగాణ మంత్రి హరీష్ రావు తన వీరాభిమాని తడబోయిన విజయ్ నివాసానికి ెవళ్లారు. విజయ్ కుటుంబ సభ్యులతో ఆయన గ్రూప్ ఫొటో దిగారు. విజయ్ తెలంగాణ విజయ్ గా పేరు సంపాదించుకున్నారు.

Telangana minister Harish Rao visits his fan Vijay residence
Author
Siddipet, First Published Jul 17, 2021, 11:57 AM IST

సిద్ధిపేట: తెలంగాణ మంత్రి హరీష్ రావు తన వీరాభిమాని తడబోయిన విజయ్ నివాసానికి వెళ్లారు. నర్సంపేట నియోజకవర్గం పరిధఇలోని నల్లబెల్లి మండలం పల్లి గ్రామంలోని తన అభిమాని విజయ్ నివాసానికి హరీష్ రావు వెళ్లారు. విజయ్ బాల్యం నుంచే హరీష్ రావు అభిమాని.

మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో తండ్రితో కలిసి అనేక స్వరాష్ట్ర ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశారు. అప్పటి ఉద్యమ నాయకులు కేసిఆర్, తన్నీరు హరీష్ రావులు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు విజయ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తడబోయిన విజయ్ సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉంటూ తెలంగాణ ప్రభుత్వ పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు ప్రముఖ తెలుగు దినపత్రికల లో తెలంగాణలో ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం చేపడుతున్న పథకాల పై ప్రజలను చైతన్యం చేస్తూ వందలాది వ్యాసాలు రాసారు... రాస్తున్నారు.

మంత్రి తన్నీరు హరీష్ రావు వీరాభిమాని గానే కాకుండా... ప్రభుత్వ కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విజయ్ చేస్తున్న కృషి మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఆకర్షించింది.తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాకుండ, తెలంగాణ పునర్నిర్మాణంలో క్రీయశీలకంగా ఉంటూ తడబోయిన విజయ్... తెలంగాణ విజయ్ గా పాపులర్ అయ్యాడు.

కాగా శుక్రవారం సాయంత్రం నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తడబోయిన విజయ్ నల్లబెల్లి సమీపంలో ఉన్న గ్రామంలోని తన ఇంటికి రావాల్సిందిగా మంత్రి తన్నీరు హరీష్ రావును ఆహ్వానించారు.

ఆ ఆహ్వానం హరీష్ రావు మేరకు విజయ్ ఇంటికి వెళ్ళారు. విజయ్ కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సాగు చేస్తున్న పంటల గురించి విజయ్ కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫోటో దిగారు. మంత్రి తన్నీరు హరీష్ రాకతో విజయ్ కుటుంబంలో ఆనందం వెళ్లివిరిసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి, అది ఆరడుగుల బుల్లెట్, ట్రబుల్ షూటర్, అభిమాన జన నాయకుడు మంత్రి తన్నీరు హరీష్ రావు కొండైలు పల్లి
గ్రామం కు తొలిసారి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios