హైదరాబాద్.కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమవారం నాడు  దేశంలోని పలు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖల మంత్రులతో  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఐహె‌చ్ఐపీ యాప్ తీసుకొచ్చినందుకు కేంద్రానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ  యాప్ ని తెలంగాణ ప్రభుత్వం పైలట్ బేసిస్ కింద 2018 నుండి వినియోగిస్తున్న విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు. 

33 రకాల అంటువ్యాధుల వ్యాప్తి ని రియల్ టైం లో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.గ్రామీణ స్థాయిలో ఏఎన్ఎం లకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో మెడికల్ ఆఫీసర్స్, లాబ్ టెక్నీషియన్ల కు ట్రైనింగ్ అందించామని మంత్రి తెలిపారు.ఈ యాప్ వైరస్ వ్యాప్తిని గుర్తించడం లో సహాయపడుతుందన్నారు.