కేసీఆర్ సిఎంగా, నేను మంత్రిగా లేకున్నా....: ఈటెల సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నా లేకున్నా, తాను మంత్రిగా ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉంటామని ఈటెల రాజెందర్ అన్నారు.
కరీంనగర్: కెసీఆర్ ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా లేకున్నా రైతుల కోసం పనిచేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని రైతు వేదికను ఆయన ప్రారంభించారు. మార్గం మధ్యలో మంత్రికి ఎడ్ల బండ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు
తనకు కేసీఆర్ తో 20 ఏళ్ల అనుబంధం ఉందని, ఇన్నేళ్ల సంబంధంలో తనకు కేసీఆర్ మీద ఆజమాయిషీ ఉంటుందని ఆయన అన్నారు. రైతులు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. ఆరేళ్ల కాలంలో కేసీఆర్ అనేక సార్లు సమావేశం పెట్టింది కేవలం వ్యవసాయం మీద మాత్రమేనని ఆయన అన్నారు.
తనలాంటివాడు ఉపన్యాసం ఇస్తే నిజమని అందరు భావిస్తారని, అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. గతంలో ఎస్సార్ఎస్సీతో చేసుకున్న ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. చేసుకున్న ఒప్పందాలు అమలు కావడానికి స్వయంగా పాదయాత్ర చేశానని ఆయన చెప్పారు ఈ కాలువలో నీళ్లు పారిస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఇది సాకారమైందని ఆయన అన్నారు.
ఈ ప్రాంతంలో చివరి మోటార్లు నడిచేవి కావని, మోటార్లు కాలిపోతే సగం పొలాలు ఎండిపోయేవని ాయన అన్నారు. రెండు ఎకరాలు సాగు చేస్తే చేతికి వచ్చి సరికి ఎకరం దిగుబడి దక్కేది కాదని అన్నారు. తెలంగాణ విద్యుత్తు కోతలను జయించిందని చెప్పారు.
ఆంధ్రలో పవర్ ప్లాంట్లు ఉన్నాయి, తెలంగాణలో ఎక్కడున్నాయంటూ ఒకప్పుడు ఆంధ్రోళ్లు బనాయించారని ఆయన అన్నారు. అనేక పార్టీలు, జెండాలు ఉన్నాయని, ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇచ్చిన రాష్ట్రాలున్నాయా చెప్పాలని అన్నారు. గతంలో 3 వేల క్యూసెక్కుల నీళ్లకు పరిమితమైన కాలువ నీళ్లను ప్రస్తుతం 6 వేల క్యూసెక్కుల నీళ్లు పెంచామని ఆయన తెలిపారు.
రైతు ఏడిస్తే తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ ఒక్కడేనని అన్నారు. ఎస్సారెస్పీ కాలువల వీమద బిజెపి తూములు పెట్టి చెరువులు నింపుతున్న రాష్ట్రం ఉందంటే అది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. మన ప్రాంతంలో పండిన సీడ్ మరెక్కడా పండదని ఆయన అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 70 శాతం సీడ్ వస్తుందని, తాను భరోసా ఇస్తున్నానని ఆయన అన్నారు.
కేసీఆర్ మనస్తత్వం తనకు తెలుసునని, వ్యవసాయరంగంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలనేది సీఎం కోరిక అని ఆయన అన్నారు. ఇవాళ్ కేసీఆర్ సీఎంగా ఉననా లేకపోయినా, తాను మంత్రిగా ఉన్నా లేకు్నా రైతులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.