Telangana Covid 19 Cases: తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌న‌.. ఈ రోజు కేసులెన్నంటే?

Telangana Covid 19 Cases: తెలంగాణ‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 68,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,398 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో ముగ్గురు క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయారని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 

Telangana logs 2398 new Covid cases, registers 3 deaths

Telangana Covid 19 Cases: తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో 68,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,398 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ  మేరకు వైద్య ఆరోగ్యశాఖ  శుక్ర‌వారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసుల‌తో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,05,199కి చేరింది. అదే స‌మ‌యంలో క‌రోనా మ‌హామ్మారికి ముగ్గురు బ‌లయ్యారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,052కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 1,181 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల కేసుల సంఖ్య 6,79,471కి చేరింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా 21,676 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఈ రోజువ‌ర‌కూ తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా 3,05,20,564 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది, 

తాజా కేసుల ప్ర‌కారం.. జీహెచ్ఎంసీ పరిధిలోనే  అత్య‌ధికంగా.. 1233 కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌రువాత రంగారెడ్డిలో 192, మేడ్చల్-మల్కాజిగిరిలో  191 కేసులు నమోదయ్యాయి. ఇదే స‌మ‌యంలో  తెలంగాణలో క‌రోనా వ్యాప్తి పెరుగుద‌ల‌తో పాటు.. అయితే అదే స్థాయిలో రికవరీ రేటు ఉంద‌ని వైద్య‌శాఖ తెలిపింది. మ‌న రాష్ట్రంలో 96.35 శాతం రికవరీ రేటుతో కోలుకుంటున్న‌ర‌ని తెలిపింది. ఈ త‌రుణంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మ‌రికొన్ని రోజుల పాటు పెంచే అవ‌కాశమున్న‌ట్టు  కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ క‌రోనా కేసులు భారీగా పెరుగు తున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39,816  పరీక్షలు నిర్వహించగా.. 4,528 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,96,755 కి చేరాయి. అదే స‌మ‌యంలో  వైరస్ వల్ల ఒక్క‌రూ ప్రాణాలు కోల్పోయారని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.  

భారత దేశ వ్యాప్తంగా  కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2,64,202 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా మరో 315 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే స‌మ‌యంలో 1,09,345 మంది వ్యాధి బారి​ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్​ ప్ర‌మాద‌కారం స్థాయికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 5,753 ఒమిక్రాన్ కేసులున్నాయ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సినేష‌న్ ను వేగవంతం చేయ‌డ‌మే స‌రైన మార్గ‌మ‌ని కేంద్రం భావిస్తోంది. దేశ‌వ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,55,39,81,819కు చేరిందని కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ త‌రుణంలో  మాస్కులు ధరించాలని,  భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios