Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రేపటి నుంచే లాక్ డౌన్: నియమాలు ఇవీ...

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ నెల 12 నుండి  10 రోజుల పాటు లాక్‌డౌన్ నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. 

Telangana imposes lockdown from May 12
Author
Hyderabad, First Published May 11, 2021, 2:27 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ నెల 12 నుండి  10 రోజుల పాటు లాక్‌డౌన్ నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకొంది. మంగళవారం నాడు ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్‌డౌన్ పై నిర్ణయం తీసుకొన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు  నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొనేందుకు  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో రేపటి నుండి లాక్‌డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని అడ్వకేట్ జనరల్  హైకోర్టుకు తెలపనున్నారు. లాక్‌డౌన్ విషయమై హైకోర్టు ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. కరోనా విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

also read:ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: లాక్‌డౌన్‌పైనే ప్రధాన చర్చ

 

కరోనా వ్యాక్సిన్‌ కొనుగోలు విషయమై గ్లోబల్ టెండర్లు  పిలవాలని  రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. లాక్‌డౌన్ సమయంలో అత్యవసరమైన వాటికి మినహాయింపులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్ సమయంలో  ఏయే వాటికి మినహాయింపులు ఇవ్వనున్నారనే విషయమై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో మినహాయింపులు ఇచ్చిన తరహాలో ఈ దఫా కూడ లాక్‌డౌన్ నుండి మినహాయింపులు ఇవ్వనున్నారు. విద్యత్ ఉద్యోగులు, గ్యాస్ సర్వీస్ సిబ్బంది, మీడియా, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రులు తదితరవాటికి మినహాయింపు అవకాశం ఉంది. 

10 రోజుల తర్వాత లాక్‌డౌన్ ను కొనసాగించాలా, ఎత్తివేయాలా అనే విషయమై  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటుంది. గత వారం కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే  సమస్యే లేదని  సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే దానికి భిన్నంగా లాక్‌డౌన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకొంది. . 

Follow Us:
Download App:
  • android
  • ios