ఖానామెట్ భూముల వేలం హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. దాదాపుగా 60 మంది బిడ్డర్లు ఈ - ఆక్షన్‌లో పాల్గొన్నారు. హైటెక్ సిటీకి దగ్గరగా వుండటంతో ధర ఎక్కువ పలికినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడి భూముల్లోని 17వ నెంబర్ బిడ్‌పై హైకోర్టు స్టే విధించింది. 

హైదరాబాద్‌ ఖానామెట్‌‌లో భూముల వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులోని ప్లాట్‌ నం.17 బిడ్‌పై తుది నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్‌ నంబర్‌ 17లో వేలం ఆపాలని నలుగురు స్థానికులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ భూముల్లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీనిపై శనివారం విచారణ జరిపిన ధర్మాసనం.. ప్లాట్‌ నంబర్‌ 17కి సంబంధించి ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్టే విధించింది. తుది ఉత్తర్వులకు లోబడి వేలం ఉండాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థను (టీఎస్‌ఐఐసీకి) ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. 

కాగా, శుక్రవారం ఖానామెట్ భూముల ఈ-ఆక్షన్ ముగిసింది. ఖానామెట్‌లోని 15 ఎకరాల్లోని ఐదు ఫ్లాట్లకు వేలం వేశారు. కోకాపేట్ కంటే ఖానామెట్ భూములు ఎక్కువ ధర పలికినట్లుగా తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు వేలం జరిగింది. ఒక ఎకరం రూ.55 కోట్లకు పైగా ధర పలికినట్లుగా తెలుస్తోంది. యావరేజ్‌గా రూ.48.92 కోట్లు పలికినట్లు అధికారులు వెల్లడించారు. 

Also Read:ముగిసిన ఖానామెట్ భూముల వేలం: కోకాపేట్ కంటే భారీ ధర.. ఎకరం రూ.55 కోట్లు పైమాటే

నిన్న కోకాపేట్‌లో ఎనిమిది ఫ్లాట్లు వేలం వేశారు. ఇందుకు గాను ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు జరిగిన వేలం కూడా హోరాహోరీగా సాగింది. దాదాపుగా 60 మంది బిడ్డర్లు ఈ - ఆక్షన్‌లో పాల్గొన్నారు. హైటెక్ సిటీకి దగ్గరగా వుండటంతో ధర ఎక్కువ పలికినట్లుగా తెలుస్తోంది. ఖానామెట్ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం లభించింది.