కాంట్రాక్ట్ డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. క్రమబద్ధీకరించడకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో పిటిషన్ దాఖలైంది.

ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ క్రమబద్ధీకరించిందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషనర్ తెలిపారు.

పిటిషన్ దాఖలు చేసిన 24 మంది నిరుద్యోగులపై జస్టిస్ హిమా కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్దీకరిస్తుందని ఊహించుకుని పిటిషన్‌ ఎలా వేస్తారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  పిటిషనర్లు ఒక్కొక్కరికీ రూ.10 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.