మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని హైకోర్టులో మిర్యాలగూడ ప్రణయ్ భార్య అమృత పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

తన కథ ఆధారంగానే సినిమా తీశారని అమృత పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కథనే చిత్రంగా తీసి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆమృత ఆరోపించారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించాలని అమృత న్యాయస్థానాన్ని కోరారు.

అయితే లంచ్ మోషన్ పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో రేపు మర్డర్ సినిమా విడుదలకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.