సింగరేణి ఎన్నికలు వాయిదా: డిసెంబర్ 27న ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.ఈ ఏడాది డిసెంబర్ 27కి వాయిదా వేసింది హైకోర్టు.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలను ఈ ఏడాది డిసెంబర్ 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. నవంబర్ 30 లోపుగా ఓటరు జాబితాను సిద్దం చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కార్మిక శాఖ ఈ నెల 28న ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టును కోరింది.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు మూడు దఫాలు వాయిదా పడ్డాయి.ఈ ఏడాది జూన్ 30న తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ విషయమై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ లో సింగరేణి యాజమాన్యం సవాల్ చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నందున అధికారులంతా ఈ పనిలో ఉండే అవకాశం ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం హైకోర్టును కోరింది.
ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. మూడు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న విషయాన్ని కూడ సింగరేణి అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి యాజమాన్యం చేసిన వినతి మేరకు తెలంగాణ హైకోర్టు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది అక్టోబర్ మాసంలో సింగరేణిలో గుర్తింపు ఎన్నికల విషయమై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే వివిధ కారణాలతో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు వాయిదా పడ్డాయి.
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 22 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 7వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.ఈ నెల 9న నామినేషన్ల పరిశీలన కూడ జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కూడ కేటాయించారు. అయితే సింగరేణిలో ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం ఈ నెల 5న హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటి
షన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.